Ajay-Atul, Ajay Gogavale, Shweta Mohan & Ramajogayya Sastry

Lyrics to Endhayya Saami

ఏందయ్యా సామి ఇట్ట గాస్తాందీ ఎన్నెల
ఊపేస్తా ఉంది సిత్తరాల ఉయ్యాలా
వీచే గాలికి అత్తరద్దిందెవ్వరో
మారే జాముకి మందు పెట్టిందెవ్వరో
మాయదారి మనస్సాగక జాగరమయ్యారా

తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
సాటుగా గిచ్చినా గిలి సక్కిలి గింతైనా
మీసమే గుచ్చినా సలి సక్కెర ముద్దైనా
సురుకు మంటాదే నాతోటి సావాసం
చిన్ననాటి ఆవేశం మారదంటా నీకోసం
కండలే పెంచినా సీమకారమే తిన్నా
గుండెలో మెత్తనీ వెన్నపూసల కన్నా
నడిమి నా మెళ్లో నల్లపూస నీ సరసం
అది గుచ్చుకుంటాన్నా మెచ్చుకుంటా నీకోసం

పుట్టుకే మల్లెపువ్వు తట్టుకోరొంత నువ్వు
ఎట్టాగో గుట్టుగా నన్ను నువ్వే ఓర్చుకో
ఓ కడియాలా సెయ్యే తలగడై
రేయి తెల్లారి పో

తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
అమ్మవో ఆలివో నువ్వు ఎవరోగాని
జన్మనే ఏలవే రణబాలుని రాణి
చిగురు పాదాల సిరిమువ్వనై ఉంటా
నడుపుకో నన్ను జగమంతా నీ జంట
సూర్యుడా చంద్రుడా నీ రెండు ముఖాల్ని
సూటిగా చూసినా నీ ఇంటి ఇల్లాల్ని
ఉడుకు నాదంటా సిరి చలవ నాదంటా
నీ వెలుగు నీడల్లో చెరిసగం నేనుంటా

ఎట్టనే ఇంతకంట ప్రేమనే చెప్పుకుంటా
నువ్వులో నేనుగా జత చేరిపోతానే
ఓ అమ్మ పోలికయ్యే బొమ్మకు ఆయువునైతాలే

తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా
తడిసిపోయారా తడి మెరిసిపోయారా
నీ చిలిపి కలల్లో ఒళ్లు మరిసిపోయారా